నిన్ను 'Miss Universe'గా పిలవాలంటే సిగ్గుగా ఉంది: హర్నాజ్‌పై ట్రోలింగ్

by Disha Web Desk 10 |
నిన్ను Miss Universeగా పిలవాలంటే సిగ్గుగా ఉంది: హర్నాజ్‌పై ట్రోలింగ్
X

దిశ, సినిమా: మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు బరువు పెరగడంపై దారుణమై ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. తాజాగా న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన అందాల పోటీలో USAకు చెందిన 'ఆర్ బోనీ‌నోలా గాబ్రియెల్' (R'Bonney Nola Gabriel) 2022 మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుంది. కాగా 2021 మిస్ యూనివర్స్‌ హర్నాజ్ సంధు 71వ మిస్ యూనివర్స్‌ కిరీటాన్ని బోనీకి అందించింది. అయితే ఆ సమయంలో నలుపు రంగు దుస్తులు ధరించి బ్యూటీఫుల్‌గా కనిపించిన హర్నాజ్.. చివరిసారిగా వేదికపై నడుస్తూ భావోద్వేగానికిలోనైంది. అలాగే ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిన ఆమె స్టేజీపై అందంగా అడుగులేయడంలో కాస్త తడబడింది. దీంతో నటిని బాడీ షేమింగ్ గురిచేసిన నెటిజన్లు.. 'హర్నాజ్ గర్భవతి అయింది', 'ఇంత లావుగా ఉన్న మిస్ యూనివర్స్‌ను పబ్లిక్ ఫిగర్‌గా చెప్పకోవాలంటే మాకు సిగ్గుగా ఉంది' అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: బెడ్ రూమ్‌లో బోల్డ్ యాంగిల్స్.. పిచ్చెక్కించిన Shama సికంద్ర్

ఆ టాటూ సీక్రెట్ చెప్పేసిన రష్మిక.. వారికోసమేనట!

Next Story

Most Viewed