- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాహుబలి -1 రేంజ్‌లో 'హరిహర వీరమల్లు'.. ఆ సీన్‌కి పిచ్చెక్కడం ఖాయమా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu).

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) విలన్‌గా కనిపించనున్నాడు. అయితే దీనిని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(AM Rathnam) నిర్మిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు విజేత ఎం ఎం కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్నారు.
కాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూన్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. బాహుబలి(Bahubali-1) వన్‌లో ఏ విధంగా అయితే ఆసక్తి జనరేట్ చేసే విధంగా రెండో భాగానికి లీడ్ ఇచ్చారో హరి హర వీరమల్లులో కూడా మంచి ఆసక్తి కలిగించే పాయింట్‌తో సెకండ్ పార్ట్‌కు లీడ్ ఇస్తారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా..ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది.






