పీవీ నరసింహారావుకు భారతరత్న రావడం సంతోషకరం : చిరంజీవి

by Jakkula Samataha |   (  Updated:2024-02-09 13:13:08  IST  )

తెలుగు ప్రజల గౌరవం, తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న ప్రకటటించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ప్రముఖులు మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

పీవీ నరసింహారావుకు భారతరత్న రావడం సంతోషకరం : చిరంజీవి
X

దిశ, సినిమా : తెలుగు ప్రజల గౌరవం, తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ప్రముఖులు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కాగా, పీవీకి భారత రత్న రావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

భారత దేశాన్ని ఆర్తిక శక్తిగా మార్చేందుకు పునాది వేసిన తెలుగు బిడ్డ పీవీకి భారతరత్న దక్కడం చాలా సంతోషం. నిజమైన దార్శనికుడు, విద్యావేత్త, బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడు, తెలుగు వారి గర్వకారణం, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతదేశాన్ని మార్చి వేసి.. భారత్‍ను ఆర్థిక శక్తిగా మార్చాడనికి పునాది వేసిన వ్యక్తి మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు. ఆయనకు భారతరత్నతో సత్కారం దక్కింది. ఇది భారతీయులందరికీ ముఖ్యంగా తెలుగు వారికి మరింత సంతోషకరమైన విషయం” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Next Story