రికార్డ్స్ బ్రేక్.. వారం రోజుల్లోనే అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిన హనుమాన్‌ మూవీ

by Samataha |
రికార్డ్స్ బ్రేక్.. వారం రోజుల్లోనే అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిన హనుమాన్‌ మూవీ
X

దిశ, సినిమా : చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలైన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజా సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. తక్కువ బడ్జెట్‌తో రిలీజై, రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.దేశవ్యాప్తంగా ప్రస్తుతం హనుమాన్ హవా కొనసాగుతుంది. కాగా, ఈ మూవీ విడుదలైన రెండు వారాల్లోనే రూ. 150 కోట్లు రాబట్టినట్లుగా మైత్రి మూవీస్ తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లోనే రూ.150 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ` అన్ని చోట్ల ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని.. మరికొన్ని రోజుల్లో హనుమాన్ కలెక్షన్స్ మరిన్ని పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.65 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.


Next Story

Most Viewed