చీరకట్టులో సెగలు పుట్టిస్తోన్న యాపిల్ బ్యూటీ.. వారికి హార్ట్ బీట్ పెరగడం ఖాయం!

by Anjali |
చీరకట్టులో సెగలు పుట్టిస్తోన్న యాపిల్ బ్యూటీ.. వారికి హార్ట్ బీట్ పెరగడం ఖాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ హన్సిక మోత్వానీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోంది. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. నేడు (నవంబర్ 17) ఈ బ్యూటీ నటించిన లేడీ ఓరియెంటెడ్ ‘మై నేమ్ ఈజ్ శృతి’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించారు. ఇందులో హన్సిక నటనకు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌లో హన్సిక ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న తరుణంలో హన్సిక చీరకట్టులో దర్శనమిచ్చి అక్కడున్నవారందరినీ తనవైపు తిప్పుకుంది.

బ్యూటీఫుల్ శారీతో పాటు స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో అమ్మడు అందాల విందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. టాప్ గ్లామర్ మెరుపులకు చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఇక హన్సిక మత్తెక్కించే ఫోజులు చూస్తే యువతకు హార్ట్ బీట్ పెరిగివాల్సిందే. తాజాగా హన్సికా పంచుకున్న ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ఈ అమ్మడు తెలుగులో ‘105 మినిట్స్’ చిత్రంలో.. అటు తమిళంలో ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’, ‘మ్యాన్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

Next Story

Most Viewed