- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న జీవీ ప్రకాష్.. హీరోయిన్ ఎవరంటే?
బలమైన కథనం, క్రికెట్ నేపథ్యంలో సాగే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి.

దిశ, సినిమా: కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ స్టార్ జీవీ ప్రకాష్ కుమార్ ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంగీత దర్శకుడిగా తన మార్కును చూపిస్తూనే, నటుడిగా కూడా విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. ఇటీవల ‘హ్యాపీ రాజ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన కొంచెం కూడా గ్యాప్ తీసుకోకుండా.. ఓ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా, ఆయన క్రికెట్ నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలో క్రికెట్, ప్రేమ కలగలిసిన కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. భావోద్వేగాలు, ఆటలో గెలుపు కోసం చేసే పోరాటం, మనసుకు హత్తుకునే అనురాగం.. ఈ మూడింటినీ కలిపి చూపిస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.
గతంలో ‘జెర్సీ’, ‘కానా’ వంటి చిత్రాలు ఎలాగైతే క్లాసిక్స్‌గా నిలిచాయో, ఇప్పుడు జీవీ ప్రకాష్ చేయబోతున్న ఈ చిత్రం కూడా అదే బాటలో సాగనుందని సమాచారం. బలమైన కథనం, క్రికెట్ నేపథ్యంలో సాగే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి.‘జ్యో’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు హరిహరణ్ రామ్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాలో మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. లార్క్ ప్రొడక్షన్స్, పారలల్ యూనివర్స్ బ్యానర్స్‌పై కె. కుమార్, ప్రకాష్ కుమార్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రికెట్ అంటే పడిచచ్చే యువతకు, రొమాంటిక్ లవ్ స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ట్రీట్ కానుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. జీవీ ప్రకాష్ ఈ సినిమా కోసం క్రికెట్ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోనున్నట్లు టాక్.






