- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనిల్ రావిపూడి సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్?
వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమా కోసం తమిళం మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో వరుస హిట్స్ తో దూసుకు వెళ్తున్నాడు. పటాస్ నుంచి మొదలుకొని మన శంకర వరప్రసాద్ గారు సినిమా వరకు అన్ని బంపర్ హిట్లే. ఒక్క ఫెయిల్యూర్ లేదు. దీంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసేందుకు సీనియర్ నుంచి జూనియర్ల వరకు అందరి హీరోలు ఎగబడుతున్నారు. అయితే ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇద్దరు హీరోలతో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా వచ్చే సంక్రాంతి సమయంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమా కోసం తమిళం మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు అనిల్ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందించాడు. భీమ్స్ మ్యూజిక్ అనిల్ రావిపూడి సినిమాలకు చాలా ప్లస్ అయింది. అయినప్పటికీ అతన్ని కాదని తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ పేరును అనిల్ ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలో ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం.






