Guppedantha Manasu September 04 : రిషి రూమ్‌ కి వెళ్లి.. సీక్రెట్ కనిపెట్టిన ఏంజెల్‌?

by Phanindra |   (  Updated:2023-09-04 06:17:20  IST  )

గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Guppedantha Manasu September 04 : రిషి రూమ్‌ కి వెళ్లి.. సీక్రెట్ కనిపెట్టిన ఏంజెల్‌?
X

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

రిషి లేని సమయంలో ఏంజెల్ రూమ్‌లోకి వెళ్తుంది. తలగడ కింద అతడు దాచిన పెయింటింగ్‌ను చూస్తుంది. దానిలో పెయింటింగ్‌ తో కళ్లు ఉంటాయి. ఏంజెల్‌ గుర్తుపట్టలేకపోతుంది. ఆ కళ్లు ఎవరివో కనిపెట్టడం కోసం ఫోన్‌లో ఫొటో తీసుకుంటుంది. రిషి రూమ్ నుంచి బయటకు వస్తోన్న ఏంజెల్‌కు ఎదురుపడతాడు. ఆ తర్వాత ఇద్దరు మరోసారి పెళ్లి టాపిక్ మాట్లాడుకుంటారు. నా జీవితంలో ప్రేమ, పెళ్లి బంధాలకు ఎప్పుడో ముగింపు పలికానని కోపంగా రిషి చెబుతాడు. నీ మనసులో ఎవరైనా ఉంటే.. నాకు చెప్పు అని అమ్మాయి ఉంటే రిషిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంజెల్‌. ఆ ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవు.. మళ్లీ మళ్లీ అడిగి ఇబ్బంది పెట్టకు.. అలాగే నువ్వు ఇకపై పెళ్లి గురించి పదే పదే అడగొద్దని అంటాడు. నా విషయంలో నువ్వు కోరుకున్నది ఎప్పటికీ నిజం కాదని అంటాడు. రిషి వేసిన పెయింటింగ్ ద్వారా అతడు ప్రేమించింది ఎవరినో తెలుసుకోవాలని ఏంజెల్ ఫిక్స్ అవుతుంది.

Read More: బిగ్ బాస్-7 నుంచి చివరి నిమిషంలో తప్పుకున్న స్టార్స్ వీళ్లే..

Next Story