Guppedantha Manasu: వసు, రిషిని చూసి.. షాక్ అయిన ఏంజెల్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది..

by Disha Web Desk 10 |
Guppedantha Manasu: వసు, రిషిని చూసి.. షాక్ అయిన ఏంజెల్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది..
X

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

సరిగ్గా అప్పుడే అక్కడ ఓ కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు నుంచి విశ్వనాధం, ఏంజెల్ దిగుతారు. మెడలో దండతో నవ్వుతూ ఉన్న రిషిధారను చూసి ఇద్దరూ షాక్ అయిపోతారు. ఏంజెల్ కళ్లనిండా నీళ్లు పొంగి.. అలానే ఆగిపోతాయి. హలో సార్ అని రిషి అంటాడు . ‘హలో రిషీ’ అని అంటాడు విశ్వనాధం. వసు.. ఏంజెల్ ఎక్స్‌ప్రెషన్స్ గమనించి మరీ.. ‘హాయ్ ఏంజెల్..’ అంటుంది. ‘హాయ్ ఏంజెల్.. బాగున్నావా?’ అని రిషి అడుగుతాడు.. ‘నేను అస్సలు బాలేను.. ఏంటి రిషీ ఇది? అని ఏంజెల్ కోపంగా అంటుంది. ‘ఏంజెల్.. ఇప్పుడు ఏ విషయాలు గురించి మాట్లాడొద్దు .. మనం ఇంటికి తీసుకెళ్లి మాట్లాడదాం..’ అని విశ్వానాధం అంటాడు.

‘పదండి లోపలికి వెళ్దాం..’ అని అంటాడు గురుచరణ్‌ని రిషిని ఉద్దేశించి విశ్వనాధం. అంతా లోపలికి నడుస్తారు. రిషిధార దగ్గరకంటూ వస్తుంది ఏంజెల్. ‘ఏంజెల్ ఫేస్‌లో వంద ప్రశ్నలున్నాయి నన్ను అడగాలని..’ అంటూ రిషి.. ఏంజెల్ వైపు చూస్తూ ఉంటాడు. అల్లాడిపోతుంది ఏంజెల్. రిషిధారలిద్దరూ ఏంజెల్ కళ్లల్లోకి చూడలేక తలదించుకుంటారు. ‘చాలా థాంక్స్.. నీ భార్యని చూపించినందుకు..’ అంటుంది ఏంజెల్ చాలా కోపంగా రిషితో. ఇక్కడితో ఈ సీను ముగుస్తుంది.



Next Story

Most Viewed