- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్‌ఈవెంట్‌కు హైదరాబాద్పోలీసులు అనుమతిని నిరాకరించారు.

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్‌ఈవెంట్‌కు హైదరాబాద్ పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఇటీవల బిగ్బాస్ఫైనల్ ఘటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కల్పించటం సాధ్యం కాదన్న అభిప్రాయంతోనే అనుమతిని నిరాకరించినట్టు సమాచారం. మహేశ్‌బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాను నిర్మాతలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూసుఫ్‌గూడలోని పోలీస్ లైన్స్‌లో ఉన్న గ్రౌండ్‌లో రేపు (శనివారం) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని భావించిన నిర్మాతలు అనుమతిని కోరుతూ పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే, బందోబస్తు కల్పించటం సాధ్యం కాదేమోనన్న అభిప్రాయంతో దీనికి పోలీసు అధికారులు నిరాకరించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.






