- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోపీచంద్ ‘రామబాణం’ ట్రైలర్ విడుదల..
టాలీవుడ్ హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’.

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’. ఈ చిత్రంలో బోల్డ్ డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిక్కీ జె సంగీతం అందిస్తున్నాడు. ఇందులో తరుణ్ రాజ్ అరోరా విలన్‌గా నటించగా.. జగపతి బాబు, ఖుష్బూ, నాజర్, శుభలేక సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా, రామబాణం ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ విషయాన్ని స్వయంగా గోపీచంద్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ట్రైలర్‌లో గోపిచంద్ మాస్ యాక్షన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా వేసవి కానుకగా మే 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
Next Story






