- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
మెగా ఇంట్లో శుభకార్యం.. ఎట్టకేలకు ఆమెను పెళ్లి చేసుకోబోతున్న ఆ హీరో ?

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ మెగా హీరో పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు వార్తలు వైరల్‌గా మారాయి. ఆయన ఎవరో కాదు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ఓ ఇంటివాడు కాబోతున్నారని పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే సాయి తల్లికి ఇన్నాళ్లు నచ్చకపోవడంతో.. ఒప్పుకోలేదని టాక్. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, రామ్ చరణ్ ఆమెతో మాట్లాడి ఒప్పించినట్లు తెలుస్తోంది.
పలు కారణాల వల్ల ఇన్నాళ్లు దూరంగా ఉన్న మెగా, అల్లు ఫ్యామిలీలు ఈ శుభకార్యంతో కలవబోతున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు అవన్నీ పుకార్లని కొట్టిపారేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లకు అవన్నీ అబద్ధమని తేలడంతో పుకార్లకు చెక్ పడినట్లు అయింది.
ఇప్పుడు మరోసారి పెళ్లి వార్తలు వస్తుండటంతో కొందరు నిజం కావచ్చు అని అభిప్రాయ పడుతున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘SDT-18’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో ఐశ్వర్యలక్ష్మి(Aishwarya Lakshmi) హీరోయిన్‌గా నటిస్తుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.