- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Waltheru Veerayya,VeeraSimha Reddy సినిమాలకు ఏపీ సర్కార్ Good News
సంక్రాంతికి సందడి చేయనున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ సందర్భంగా సందడి చేయనున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు సినిమాల టికెట్ల రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదిరోజుల పాటు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాల్తేరు వీరయ్య టికెట్లను రూ.25కు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. వీరసింహారెడ్డి సినిమాకు రూ.20 పెంపునకు అనుమతి ఇచ్చింది. కాగా గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఈనెల 12 న విడుదల కానుండగా, బాబి దర్శకత్వంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల్లో శృతి హసన్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం కూడా విడుదల రోజు 6 షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : 'RRR' టీమ్‌కు అభినందనలు తెలిపిన A.R.Rahman






