ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. తారక్‌తో సినిమాకు హాలీవుడ్ డైరెక్టర్ రెడీ

by Disha Web Desk 4 |
ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. తారక్‌తో సినిమాకు హాలీవుడ్ డైరెక్టర్ రెడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తెలుగు వారి సత్తాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్ఆర్ ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ నటనకు ప్రముఖ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఫిదా అయ్యారు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 సినిమా డైరెక్టర్ జేమ్స్ గన్ తారక్‌తో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. జేమ్స్ గన్ రూపొందించిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 చిత్రం మే 5న రిలీజ్‌కు సిద్ధమైంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో బోను నుంచి పులులతో పాటు, జంప్ చేసిన వ్యక్తితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతానన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతం అన్నారు. ఆర్ ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ప్రశాంతంగా కనిపించాడన్నారు. అయితే గతంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. హాలీవుడ్ లో ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానన్నారు. తనకు మార్వెల్ సినిమాలో నటించాలని ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read...

సచ్చినా ఆ హీరోయిన్‌తో నటించను.. జూనియర్ ఎన్టీఆర్ సంచలన నిర్ణయం?


Next Story