- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల
సినీ ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend) సినిమా థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి వరుసగా చర్చల్లో నిలుస్తోంది.

దిశ, సినిమా: సినీ ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend) సినిమా థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి వరుసగా చర్చల్లో నిలుస్తోంది. రష్మిక మందన్న(Rashmika Mandanna) తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన పాత్రలన్నింటి కంటే భిన్నంగా కనిపించడం ఈ మూవీకి పెద్ద ఆకర్షణగా మారింది. కథలో ఆమె భావోద్వేగాలు, ప్రేమ, బాధ, కోపం అన్నీ కలగలిపి ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. ముఖ్యంగా లేడీ ఆడియన్స్ ఈ సినిమాతో బాగా ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూనే ఉన్నాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran)ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్‌గా తీర్చిదిద్దారని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. నిజ జీవిత సంబంధాల లోతులను, వాటి లోని ఒత్తిళ్లను, ఆత్మీయతను ప్రేక్షకుల ముందు బలంగా రుచి చూపించారు.
సినిమా అంతా రష్మిక పాత్ర చుట్టూ తిరిగినా, ఇతర పాత్రలు కూడా కథకు ముఖ్యమైన మలుపులను ఇచ్చాయి. దీక్షిత్ శెట్టి నటన ప్రశంసలు అందుకుంది. అను ఇమ్మాన్యుయేల్ పాత్ర కూడా కథలో కీలకమైన ట్విస్ట్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రశంసలే కాదు విమర్శలు కూడా వచ్చాయి. కొందరు కథలో కొన్ని సన్నివేశాలు అతిశయోక్తిగా ఉన్నాయని అన్నారు. మరికొందరు అయితే మహిళల భావోద్వేగాలను అవసరానికి మించి ఉపయోగించారని వ్యాఖ్యానించారు. అయితే మరోవైపు మంచి సంఖ్యలో ప్రేక్షకులు ఈ సినిమాను హృదయానికి హత్తుకునేలా ఉందని అభిప్రాయపడ్డారు. థియేటర్‌లో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటీలో విడుదలకు సిద్ధమవడం అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింది.
తాజాగా, ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా డిసెంబర్ 5 నుంచి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ బాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. దీంతో ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూడగల అవకాశాన్ని పొందుతున్నారు. ఓటిటీలో విడుదలయ్యాక ఈ సినిమా మరోసారి పెద్ద చర్చలకు దారి తీసే అవకాశం ఉంది. ఎప్పుడూ వ్యత్యాసమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసే రష్మికకు ఇది మరో మైలురాయిగా నిలిచింది. మరి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ సినిమా ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి.






