అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ సర్‌ప్రైజ్ ఏంటో తెలుసా..?

by Disha Web Desk 9 |
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ సర్‌ప్రైజ్ ఏంటో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లుఅర్జున్, సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం పుష్ప ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్‌ సాధించింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన దీనికి సీక్వెల్‌గా ‘పుష్ప-2’ రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ అప్‌డెట్స్ ప్రేక్షకులలో ఎంతో ఉత్సుకతని పెంచుతుంది. అయితే దర్శకుడు సుకుమార్ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానుల కోసం ఒక సర్‌ప్రైస్ ఇవ్వబోతున్నరట. అది ఏంటంటే... ‘ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌లోని కొన్ని సీన్స్ తీసివేసి 3 నిమిషాల వీడియోని రిలీజ్ చేస్తున్నారని సమాచారం రావడంతో బన్నీ అభిమానులు హుషారుగా డాన్స్‌లు చేస్తూ ఖుషి అవుతున్నారు. ఈ విషయంపై అధికారంగా ఇంకా ప్రకటన ఇవ్వనప్పటికి ప్రేక్షకులు ఈ పాన్ ఇండియా చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మొదటి భాగంలో శ్రీవల్లిగా నటించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న రెండవ భాగంలో తన పాత్ర మరింత కీలకమైందిగా ఉంటుందని పేర్కొన్నారు. హీరో ‘జగపతి బాబు కూడా ’ పుష్ప-2 లో కనిపించనున్నారు. రాబోయే షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నారు. అలాగే ఐటెమ్ సాంగ్‌కు అనసూయను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. మరొక తాజా విషయం ఏంటంటే షూటింగ్ పూర్తి కాకుండానే ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ రూ.900 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే మేకర్స్ మాత్రం రూ.1050 కోట్లు డిమాండ్ చేస్తున్నారనే టాక్ వస్తుంది. ఈ సినిమాకు ఇంతటి భారీ ఆఫర్ రావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి :

బుట్ట బొమ్మకు బైబై చెప్పిన టాలీవుడ్..? ఐటెమ్ సాంగ్‌ కూడా ఇవ్వట్లేదట!

Next Story

Most Viewed