అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డే నాడు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-17 15:10:19  IST  )

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు.

అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డే నాడు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. ఇటీవల కుబేర, కూలీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుని అదే ఫామ్‌లో ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం నాగార్జున 100వ చిత్రంతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు కార్తీక్ (Karthik)దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ మూవీగా రాబోతుండగా.. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘కింగ్-100’ (King-100)టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని అక్కినేని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు కానుకగా ‘కింగ్-100’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చి అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందులోంచి నాగార్జున స్పెషల్ లుక్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story