ఇకపై ఒంటరిగానే.. శృతి హాసన్ నిర్ణయంతో ఫ్యాన్స్ షాక్.. ఆరుసార్లు ఏం జరిగిందంటే?

by Mallepaka Hamsa |

నా జీవితంలో ఇప్పటివరకు నేను ఆరుసార్లు ప్రేమలో పడ్డాను. కానీ ఆ ప్రతిసారీ నాకు మిగిలింది కేవలం గాయాలే.

ఇకపై ఒంటరిగానే.. శృతి హాసన్ నిర్ణయంతో ఫ్యాన్స్ షాక్.. ఆరుసార్లు ఏం జరిగిందంటే?
X

దిశ, సినిమా: ఒకప్పుడు తనను ఐరెన్ లెగ్ అని వెక్కిరించిన నోళ్లతోనే.. తన టాలెంట్‌తో స్టార్ హీరోయిన్ అని అనిపించుకున్న భామ శృతి హాసన్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనను విమర్శిస్తున్న వారికి తనదైన స్టైల్‌లో కౌంటర్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్న శృతి, తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా తన ప్రేమ, బ్రేకప్స్ గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడటం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా హీరోయిన్లు తమ రిలేషన్ షిప్స్ గురించి దాస్తుంటారు, కానీ శృతి మాత్రం ఓపెన్ అయి తన మనసులోని ఆవేదనను బయటపెట్టింది. "నా జీవితంలో ఇప్పటివరకు నేను ఆరుసార్లు ప్రేమలో పడ్డాను. కానీ ఆ ప్రతిసారీ నాకు మిగిలింది కేవలం గాయాలే. అందుకే ఇకపై ప్రేమ అనే పేరు ఎత్తకూడదని నిర్ణయించుకున్నాను.

ప్రస్తుతం నాకు ప్రశాంతత ముఖ్యం, అందుకే ఒంటరిగా ఉండాలని ఫిక్స్ అయ్యాను" అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ మాటలు విన్న ఆమె అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆరు సార్లు మనసు ముక్కలవ్వడంతోనే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పర్సనల్ లైఫ్‌లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, కెరీర్ విషయంలో మాత్రం శృతి ఫుల్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమాలో నటిస్తోంది. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా వంటి టాప్ బ్యానర్స్ సమర్పిస్తున్నాయి. శృతి నటనతో పాటు ఈ మూవీలో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని సమాచారం. ఒకవైపు సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసేందుకు శృతి రెడీ అవుతోంది.

Next Story