- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్ సినిమాకు నో చెప్పిన గ్లోబల్ బ్యూటీ.. నెట్టింట దుమారం రేపుతున్న పోస్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) రీసెంట్‌గా ‘పుష్ప-2’(Pushpa-2) మూవీతో మన ముందుకు వచ్చి బాక్సాఫీస్ బద్దలు కొట్టేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) రీసెంట్‌గా ‘పుష్ప-2’(Pushpa-2) మూవీతో మన ముందుకు వచ్చి బాక్సాఫీస్ బద్దలు కొట్టేశాడు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ(Atlee)తో ఓ సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గా బన్నీ బర్త్‌డే స్పెషల్‌గా ఈ విషయాన్ని సన్ పిక్చర్స్(Sun Pictures) వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘AA22’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తోంది. అయితే ఈ సినిమాలో గ్లోబల్ క్వీన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా అల్లు అర్జున్ సినిమాకు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నో చెప్పిందట. ఎందుకంటే ఆమె మహేష్ బాబు(Mahesh babu), రాజమౌళి(Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న ‘SSMB29’పై మాత్రమే దృష్టి పెట్టాలని భావించుకుందట. ఇక ఈ కారణం వల్లే అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మూవీలో హీరోయిన్ పాత్రకు నో చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






