- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్కార్‌కే హైలెట్‌గా గ్లోబల్ బ్యూటీ నెక్లెస్.. దాని ధర ఎంతో తెలిస్తే ఖంగుతినాల్సిందే?
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై తన రాయల్ లుక్‌తో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై తన రాయల్ లుక్‌తో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ వేడుక కోసం ఆమె ధరించిన తెల్లటి డియర్ గౌన్ ఒక ఎత్తు అయితే, ఆమె మెడలో మెరిసిన బుల్గారీ సెర్పెంటి ఇల్యూసియో నెక్లెస్ ఈ వేడుకకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ నగ గురించే చర్చలు నడుస్తున్నాయి. 14 క్యారెట్ల అరుదైన మెడగాస్కర్ నీలమణిని మధ్యలో ఉంచి, వజ్రాలు, ఎమరాల్డ్స్‌తో రూపొందించిన ఈ హారం ప్రియాంక అందాన్ని రెట్టింపు చేసిందని అంతా పొగిడేస్తున్నారు. ఇక ఈ నగను తయారు చేయడానికి ఏకంగా 1,300 గంటల పాటు అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారులు శ్రమించి తయారు చేసినట్లు సమాచారం.
బుల్గారీ బ్రాండ్‌కు చిహ్నమైన పాము డిజైన్ ఇందులో చాలా అందంగా దాగి ఉండి, ప్రియాంక మెడపై ఒక వజ్రాల కవచంలా కనిపించింది. ఇక ఈ నెక్లెస్ ధర ఏకంగా రూ.8 కోట్లు ఉంటుందని సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. షాక్ అవుతున్నారు. కేవలం నగను మాత్రమే హైలైట్ చేయాలని ప్రియాంక తన మేకప్, హెయిర్ స్టైల్‌ను చాలా సింపుల్‌గా ఉంచుకోవడం విశేషం. ఆస్కార్ చరిత్రలో నిలిచిపోయే అత్యంత ఖరీదైన ఫ్యాషన్ మూమెంట్స్‌లో ప్రియాంక లుక్ ఒకటిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఒక్క నగ విలువతో ఒక భారీ బడ్జెట్ సినిమానే నిర్మించవచ్చనే చర్చ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రియాంక చేసిన ఈ వజ్రాల విన్యాసం సోషల్ మీడియాలో ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.






