ప్రియురాలికి ప్రెగ్నెన్సీ.. నా వల్లే అయిందా DNA పరీక్ష చేయండి.. పట్టుబట్టిన స్టార్ హీరో

by Disha Web Desk 9 |
ప్రియురాలికి ప్రెగ్నెన్సీ.. నా వల్లే అయిందా DNA పరీక్ష చేయండి.. పట్టుబట్టిన స్టార్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు అల్ పాసివో 83 ఏళ్ల వయస్సులో.. హాలీవుడ్ నటి నూర్‌ అల్ఫల్లాతో గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్‌ చేస్తున్నారని ఇటీవల వార్తలు వినిపించాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్న క్రమంలోనే నూర్‌ అల్ఫల్లా గర్భం దాల్చిందని, ఇప్పుడు 8 నెలల ప్రెగ్నెన్నీతో ఉందని, మరో నెల రోజుల్లో అతడు నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నాడని అల్ పాసివో సన్నిహితులు తెలిపారు. కాగా నూర్ ప్రెగ్నెన్సీ కన్ఫమ్ కాగానే వీరిద్దరి మధ్య చాలానే గొడవలు జరిగాయట. పాసివో గతంలో వైద్య పరీక్షలు చేయించుకుంటే పిల్లలు పుట్టే సామర్థ్యం లేదని తేలిందట. దీంతో నూర్ కడుపులో బిడ్డకు తండ్రి అతడో, కాదో తెలియాలంటే డీఎన్‌ఎ పరీక్ష తప్పకుండా చేయించుకోవాలని పట్టు పట్టాడు. డీఎన్‌ఎ పరీక్ష అనంతరం నూర్ కడుపులోని బిడ్డకు అల్ పాసివోనే తండ్రి అని తేలింది. కాగా.. అతడు నాలుగో బిడ్డకు తండ్రి కాగా.. అల్ఫల్లా మాత్రం మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుంది.

Also Read..

తమ కెరీర్ కోసం హీరోయిన్లు మేకర్స్‌తో అన్ని విధాలుగా కమిట్ అవుతారు.. నటి షాకింగ్ కామెంట్స్


Next Story

Most Viewed