హృదయాన్ని తాకే ఆ కథను చూడటానికి సిద్ధంగా ఉండండి.. బిగ్ అప్డేట్ ఇచ్చిన మోహన్ లాల్ (ట్వీట్)

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-18 07:04:02  IST  )

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.

హృదయాన్ని తాకే ఆ కథను చూడటానికి సిద్ధంగా ఉండండి..  బిగ్ అప్డేట్ ఇచ్చిన మోహన్ లాల్ (ట్వీట్)
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చూస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటి ఇస్తున్నారు. ఇటీవల ఎంపురాన్-2, చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తన ఖాతాలో వరుస హిట్స్ వేసుకుంటున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ ‘హృదయం పూర్వం’(hrudaya purvam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీకి సత్యన్ అంతిక్కాడ్(Satyan Antikkad) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. దీనిని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ సరసన మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బసితా జోసెఫ్(Basita Joseph), సంగీత్, సంగీత, లాలూ అలెక్స్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటినీ పెంచాయి. 65 ఏళ్ల మోహన్ లాల్ సరసన 31ఏళ్ల మాళవిక రొమాన్స్ చేయబోతుండటంతో అంతా షాక్‌కు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మోహన్ లాల్ ‘హృదయపూర్వం’ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మూవీ టీజర్ ఈనెల 19న సాయంత్రం 5గంటలకు రాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు ‘‘హృదయాన్ని తాకే ఆ కథను చూడటానికి సిద్ధంగా ఉండండి. మా సినిమా టీజర్ రాబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు.

link

Next Story