ఒక ఉత్కంఠభరితమైన కథను చూడటానికి సిద్ధంగా ఉండండి.. ‘టన్నెల్’ రిలీజ్‌పై మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-15 07:57:17  IST  )

టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi), అథర్వ మురళి(Atharva Murali) జంటగా నటించిన చిత్రం ‘టన్నెల్’(Tunnel).

ఒక ఉత్కంఠభరితమైన కథను చూడటానికి సిద్ధంగా ఉండండి.. ‘టన్నెల్’ రిలీజ్‌పై మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi), అథర్వ మురళి(Atharva Murali) జంటగా నటించిన చిత్రం ‘టన్నెల్’(Tunnel). ఈ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ సినిమాను రవీంద్ర మాధవ తెరకెక్కించారు. తెలుగులో ఎ. రాజు లచ్చురామ్ ప్రొడక్షన్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఇందులో అశ్విన్ కాకుమాన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. లావణ్య త్రిపాఠి ఇటీవల పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో వారం పాటు వాయిదా వేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా విడుదలపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించకపోవడంతో సినీ ప్రియలంతా అయోమయంలో పడిపోయారు. ఈక్రమంలో.. తాజాగా, ‘టన్నెల్’ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 19న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘తీవ్రమైన ఘర్షణకు వేదికైంది. సెప్టెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది.. పెద్ద తెరపై ఒక ఉత్కంఠభరితమైన కథను చూడటానికి సిద్ధంగా ఉండండి’’ అని తెలిపారు.

link

Next Story