రతితో ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉండండి.. ‘మాస్క్’ మూవీ అప్డేట్ ఇచ్చిన రుహాని శర్మ

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-07 06:49:11  IST  )

యంగ్ హీరో కవిన్(kavin) విభిన్న కథలు ఎంచుకుంటూ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు.

రతితో ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉండండి.. ‘మాస్క్’ మూవీ అప్డేట్ ఇచ్చిన రుహాని శర్మ
X

దిశ, సినిమా: యంగ్ హీరో కవిన్(kavin) విభిన్న కథలు ఎంచుకుంటూ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ఇటీవల ‘కిస్’ అంటూ లవ్ చిత్రంతో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. కానీ హిట్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం కవిన్ ‘మాస్క్’(mask) మూవీ పనులో ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ సినిమాకు వి.కర్ణన్ అశోక్(V.Karnan Ashok) దర్శకత్వం వహిస్తున్నారు. గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ, బ్లాక్ మద్రాస్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై ఎస్పీ చొక్కలింగం, వెట్రిమారన్ నిర్మిస్తున్నారు. ఇందులో కవిన్ సరసన ఆండ్రియా జెరెమియా(Andrea Jeremiah), రుహాని శర్మ(Ruhani Sharma) హీరోయిన్లుగా నటిస్తుండగా.. కార్లీ, బాల శరవణన్, విజె అర్చన చందోక్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘మాస్క్’ అక్టోబర్ 31నథియేటర్స్‌లో విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను విజయ్ సేతుపతి చేతుల మీదుగా లాంచ్ చేయించారు. ఈ విషయాన్ని తెలుపుతూ రుహాని శర్మ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘రతి ప్రపంచంలోకి అనుమతిస్తున్నాను. హృదయం నుంచి నేరుగా ఒక భాగం. ఆమెను కలవడానికి, అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండండి. మీరు రతితో ప్రేమలో పడటాన్ని చూసేందుకు నేను వేచి ఉండలేకపోతున్నాను’’ అనే క్యాప్షన్ జత చేసింది. రుహానీ శర్మ కోలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండటంపై.. వెల్‌కమ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story