ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

by Disha Web Desk 7 |
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘సలార్’. ఈ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నెల 28న రిలీజ్ కావాల్సిన మూవీ పోస్ట్‌పోన్ కావడం అభిమానులకు షాక్ ఇచ్చింది. వాయిదా వేస్తున్న సంగతి చెప్పిన నిర్మాతలు.. కొత్త రిలీజ్ డేట్‌ను మాత్రం ప్రకటించలేదు. దీంతో ఇప్పటికే చాలా ఈ మూవీ రిలీజ్ డేట్స్ నెట్టింట వినిపిస్తూ ఉండటంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే తాజాగా డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్నట్లుగా మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్‌కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు టాక్. అయితే దానికి ముందు రోజే షారుఖ్ ‘డుంకీ’ కూడా రిలీజ్ కానుంది. రాజ్‌ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే చాన్స్ ఉండగా.. ప్రభాస్, షారుఖ్‌కు జరిగే బ్యాటిల్‌లో గెలుపెవరిదో చూడాలి మరి.

Next Story

Most Viewed