- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబుల్ యాక్షన్స్, రెట్టింపు థ్రిల్స్ కోసం సిద్ధంగా ఉండండి.. ‘రెట్టతల’ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరోల కానుంచి స్టార్స్ వరకు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు.

దిశ, సినిమా: యంగ్ హీరోల కానుంచి స్టార్స్ వరకు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. నెలకు కనీసం అరడజన్ చిత్రాలైనా థియేటర్స్‌కు వస్తున్నాయి. కానీ చాలా మూవీస్ జనాల ఆదరణ పొందలేక.. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి. మరికొన్ని చిన్న చిత్రాలుగా వచ్చి ఊహించని రెస్పాన్స్‌తో లాభాలు తెచ్చిపెడుతున్నారు. ఇక ఇప్పటికే నవంబర్‌లో విడుదలైన చిత్రాలు అంతంత మాత్రంగానే మెప్పిస్తున్నాయి. ఇక డిసెంబర్‌లో మాత్రం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కాబోతున్నాయి. అన్ని చిత్రాలు క్రిస్మస్ కానుకగా రాబోతుండటం గమనార్హం.
ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మరో మూవీ చేరింది. కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్(Arun Vijay) నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రెట్టతల’(RettaThala ). క్రిస్ తిరుకుమారన్(Chris Thirukumaran) దర్శకత్వంలో రాబోతుండగా.. బాబీ బాలచంద్రన్ సమర్పణలో బీటీజీ యూనివర్శల్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో తాన్య రవిచంద్రన్, సిద్ధి ఇద్నానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. మేకర్స్ పోస్ట్ పెట్టారు. ‘‘రెట్టింపు యాక్షన్స్, రెట్టింపు థ్రిల్స్ కోసం సిద్ధంగా ఉండండి. ‘రెట్టతల’ డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది. ఈ తుఫానును మిస్ అవ్వకండి’’ అని తెలిపారు.






