- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ స్పెషల్ డే నాడు ‘మెగా-157’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్ రాబోతుంది.. మూవీ మేకర్స్ ఆసక్తికర పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) 2023లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) 2023లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. మెగాస్టార్-అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘మెగా-157’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార(Nayanthara) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ప్రజెంట్ ‘మెగా-157’ చిత్రీకరణ కేరళలో జరుగుతున్నట్లు సమాచారం.
నయనతార, చిరంజీవి మధ్య సీన్స్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈసినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ మెగా అభిమానులుకు గుడ్ న్యూస్ తెలిపారు. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ‘మెగా-157’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్ కోసం మెగా అభిమానులు సిద్ధంగా ఉండాలని అధికారికంగా ప్రకటించారు. మెగాస్టార్ బర్త్ వేడుకలను చిరు, అనిల్ రావిపూడి స్టైల్లో సెలబ్రేట్ చేసుకోవాలని వెల్లడించారు. అయితే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు సమాచార. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






