అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బర్త్ డే సందర్భంగా కామన్ డీపీ రిలీజ్

by Disha Web Desk 16 |
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బర్త్ డే సందర్భంగా కామన్ డీపీ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. దీంతో బన్నీ బర్త్ డే వేడుకలను దుబాయ్‌లో నిర్వహించేందుకు గీతా ఆర్ట్స్ రెడీ అయింది. ఈ వేడుకల్లోనే పుష్పా-2 (ది రూలర్) టీజర్‌ను కూడా విడుదల చేయనున్నారు. తాజాగా బన్నీ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. బర్త్ డే సెలబ్రేషన్‌కు సంబంధించి అల్లు అర్జున్ కామన్ డీపీ విడుదల చేశారు. మరో రెండు రోజుల్లో పుష్పా మాస్ జాతర జరగబోతోందని పేర్కొన్నారు. అయితే ఈ లుక్‌లో అల్లు అర్జున్ ఊర మాస్‌గా కనిపిస్తున్నారు. ఈ సీడీపీని చూసి బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వారి ఫోన్ డీపీల్లో బన్నీ ఫోటోను పెట్టుకుని మురిసిపోతున్నారు. అంతేకాదు ఒకరి నుంచి ఒకరికి భారీగా షేర్ చేస్తున్నారు.

కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 15 AUG 2024న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Next Story

Most Viewed