అలాంటి ప్రాజెక్టుల్లో పనిచేయడం దండగే: యామీ గౌతమ్

by Dishanational4 |
అలాంటి ప్రాజెక్టుల్లో పనిచేయడం దండగే: యామీ గౌతమ్
X

దిశ, సినిమా: ప్రజలు తను పోషించిన ప్రతి పాత్ర గురించి మాట్లాడుకోవాలని కోరుకుంటానంటోంది యామీ గౌతమ్. అది సోలో ఫిల్మ్ అయిన లేదా మల్టీస్టారర్ అయినా.. తాను పాల్గొన్న ప్రాజెక్ట్ వెలుగులోకి రావడంతో పాటు వ్యక్తిగతంగా ప్రత్యేక గుర్తింపునివ్వాలని చెప్పింది. ఇందుకోసం ఒక సినిమాకు సైన్ చేసే ముందు స్క్రిప్ట్‌లో ఏముందో, తనుకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుందో పరిశీలిస్తానని తెలిపింది. ఇందులో భాగంగానే 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమా స్టోరీ వినగానే వెంటనే చేయాలని ఫిక్స్ అయినట్లు తెలిపింది. ఇక అనుకున్నట్లే అందులో పోషించిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్ర గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పింది. 'కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు. ఎలాంటి పాత్రలు చేశాం. జనాలు నుంచి ప్రశంసలు లభించాయా లేదా అనేది ఇంపార్టెంట్. అదే మన జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోవడంతో పాటు మరిన్ని చిత్రాలు ఎంచుకోవడానికి ప్రేరణగా నిలుస్తుంది' అని తెలిపింది. ఇక తనకు నచ్చిన క్యారెక్టర్‌కు న్యాయం చేయడంలో వెనుకడుగు వేయనని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి :

1.స్టేజ్ పైనే Chiranjeevi సరసాలు.. ఏ Heroine తో తెలుసా?

2.నా కెరీర్‌ మొత్తం ఆ పేరు కోసమే ఆరాటపడ్డాను: కరీనా

Next Story

Most Viewed