- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మన గరివిడి లక్ష్మి ఒచ్చేసింది.. ఇక స్టేజిరెక్కి అగ్గిదీసేద్దంతే!.. క్యూరియాసిటీ పెంచుతున్న టాలీవుడ్ హీరోయిన్ పోస్టర్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆనంది(Anandhi) ఇటీవల ‘భైరవం’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆనంది(Anandhi) ఇటీవల ‘భైరవం’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. ఆనంది ‘ప్రేమంటే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రియదర్శి(Priyadarshi) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నవనీత్ శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలో..తాజాగా, ఆనంది మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది.
‘గరివిడి లక్ష్మి’(Garividi Lakshmi) సినిమాతో రాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ఇక ఆనంది గరివిడి లక్ష్మి గెటప్‌లో రిక్షాలో కూర్చొని లంగా ఓణిలో సంప్రదాయ లుక్‌లో కనిపించింది. అలాగే ఆమె పట్టుకున్న హార్మోనియం. ఇవన్నీ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. అమాయకపు నవ్వుతో నెటిజన్లను ఫిదా చేస్తుంది.
ఇక ఈ పోస్ట్‌కు.. ‘‘మన గరివిడి లక్ష్మి ఒచ్చేసింది.. ఇక స్టేజి రెక్కి అగ్గిదీసేద్దంతే!అనేక హృదయాలను తాకిన ఒక స్వరం కథ’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఈ మూవీ లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా ద్వారా గౌరీ నాయుడు జమ్మూ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇందులో రాగ్ మయూర్, నరేష్, రాశి, శరణ్య, ప్రదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ కుమార్తె కృతి ప్రసాద్ నిర్మాతగా పరిచయమవుతున్నారు.
చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా బుర్రకథలో ఒక కొత్త ఒరవడిని సృష్టించి, యావత్ ఉత్తరాంధ్ర ప్రజలను తనవైపు తిప్పుకొని అద్భుతమైన పేరును తెచ్చుకున్న బుర్రకథ కళాకారణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. అంతేకాకుండా ఈ చిత్రం ఆమె పేరుతోనే రాబోతుండటం విశేషం. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






