యాక్షన్ మోడ్‌లో అట్రాక్ట్ చేస్తున్న కత్రిన.. ‘టైగర్‌-3’ నుంచి స్పెషల్ పోస్టర్‌

by Disha Web Desk |
యాక్షన్ మోడ్‌లో అట్రాక్ట్ చేస్తున్న కత్రిన.. ‘టైగర్‌-3’ నుంచి స్పెషల్ పోస్టర్‌
X

దిశ, సినిమా: సల్మాన్ ఖాన్ టైగర్‌ సిరీస్‌లో మూడో ఫ్రాంచైజీగా రూపొందిన యాక్షన్‌ మూవీ ‘టైగర్‌-3’ నుంచి స్పెషల్ పోస్టర్‌ రిలీజైంది. యష్‌ రాజ్‌ ఫిలింస్‌ స్పై యూనివర్స్‌లో ఐదో ఇన్‌స్టాల్‌మెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 10న రిలీజ్ కాబోతుండగా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. మనీష్ శర్మ తెరకెక్కించిన ఈ మూవీ సౌత్‌లో అత్యధిక థియేటర్‌లలో రిలీజ్ అవుతున్న సల్మాన్‌ సినిమాగా రికార్డు సృష్టించనుండగా.. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా సల్మాన్‌కు జోడీగా నటించిన కత్రినా కైఫ్‌ యాక్షన్ స్టంట్‌కు సంబంధించిన న్యూ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. చేతిలో గన్ పట్టుకుని షూట్‌ చేస్తూ యాక్షన్‌ మోడ్‌లో కత్రిన కనిపించగా.. ఏ సినిమాకు చేయని సాహసాలు ఇందులో చేసిందని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్‌ అక్టోబర్‌ 16న రిలీజ్‌ కాబోతుంది.

Next Story

Most Viewed