- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను క్షమించు.. నిన్ను కాపాడుకోలేక పోయాను.. పాయల్ రాజ్ పుత్ ఎమోషనల్ పోస్ట్
ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్.

దిశ, సినిమా: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే రొమాంటిక్ యాంగిల్‌లో రెచ్చిపోయిన ఈ అమ్మడు.. తాజాగా వచ్చిన ‘మంగళవారం’ మూవీతో మరింత సక్సెస్ మూట కట్టుకుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పాయల్.. తాజాగా తాను పెట్టిన పోస్ట్‌తో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పాయల్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెట్ డాగ్ క్యాండీ మరణంతో ప్రస్తుతం దుఃఖంలో ఉంది.
ఈ మేరకు తను పెట్ డాగ్‌తో ఉన్న ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ ‘క్షమించు క్యాండీ. ఈ అమ్మ నిన్ను కాపాడుకోలేకపోయింది. నాకు ఎంతో బాధగా ఉంది. గుండె బద్దలు అవుతుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను. నీ హగ్స్, నీ ప్రేమను మిస్ అవుతాను. ఇకపై నా జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను’ అంటూ ఎమోషనల్ అయింది పాయల్. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
- Tags
- Payal Rajput






