- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నీ మర్చిపోయి కడుపుబ్బా నవ్వుకోండి.. ‘ఫంకీ’ అస్సలు నిరాశపరచదు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), దర్శకుడు కె.వి. అనుదీప్(K.V. Anudeep) కలయికలో వస్తున్న ‘ఫంకీ’(Funky) చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), దర్శకుడు కె.వి. అనుదీప్(K.V. Anudeep) కలయికలో వస్తున్న ‘ఫంకీ’(Funky) చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట ‘యమ యమ్మ’ విడుదలైంది. ఉర్రూతలూగించేలా భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ మాస్ గీతం, విన్న వెంటనే ఆకట్టుకునేలా ఉంది. అందరూ కాలు కదిపేలా భీమ్స్ అందించిన ఉత్సాహభరిత సంగీతం, ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేవ్ పవార్ అందించిన సాహిత్యం, మాస్ పాటకు తగ్గట్టుగా మళ్ళీ మళ్ళీ పాడుకునేలా ఉంది. గాయని రోహిణి సోరట్ తో కలిసి సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ పాటను ఆలపించడం విశేషం. తమ ఉత్సాహభరితమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. అదిరిపోయే మాస్ బీట్ లు, ఆట సందీప్ మాస్టర్ అద్భుతమైన డ్యాన్స్ స్టెప్స్‌తో మాస్ పాటల అభిమానులకు విందు భోజనంలా మారింది.
ఈ కార్యక్రమంలో.. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతోనే సంవత్సరం విరామం తీసుకొని ‘ఫంకీ’ సినిమా చేశాను. ఈ చిత్రం మీ అందరినీ మెప్పిస్తుంది. ఇదొక క్లీన్ ఎంటర్టైనర్. మీ కుటుంబంతో కలిసి థియేటర్ కి రండి. రెండు గంటల పది నిమిషాల పాటు అన్నీ మర్చిపోయి కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం. మిమ్మల్ని ఈ సినిమా అసలు నిరాశపరచదు." అన్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా 'ఫంకీ' చిత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం ఖాయమని చిత్ర బృందం హామీ ఇచ్చింది.






