- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊరిని ప్రేమించే వారికోసం.. ‘గోదారి గట్టుపైన’ మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్ లోడింగ్!
సొంత గ్రామాన్ని అమితంగా ప్రేమించే వారికోసం, పల్లెటూరిని వదిలి దూరంగా ఉంటూ ఊరిని తలుచుకుని బాధపడే వారికోసం ఈ పాటను అంకితం ఇస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

దిశ, సినిమా: ‘మేమ్ ఫేమస్’ చిత్రంతో యూత్ ఆడియన్స్‌కు చేరువైన సుమంత్ ప్రభాస్, ఇప్పుడు ‘గోదారి గట్టుపైన’ అనే మరో అందమైన గ్రామీణ ప్రేమకథతో మన ముందుకు రాబోతున్నాడు. సుమంత్ ప్రభాస్ సరసన నిధి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుభాష్ చంద్ర చాలా సహజంగా తెరకెక్కిస్తున్నారు. అభినవ్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు ఒక కీలక పాత్రలో కనిపిస్తుండటం విశేషం. కథ మొత్తం గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా వేల్పూరు, రేలంగి, భీమవరం వంటి పల్లెటూరి లొకేషన్లలో షూటింగ్ జరిపారు. పచ్చటి పొలాలు, గోదావరి గట్టు, పల్లెటూరి మనుషుల మధ్య జరిగే ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా ఇది ఉండబోతోంది. రాజీవ్ కనకాల, లైలా, దేవిప్రసాద్ వంటి సీనియర్ నటులతో పాటు సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి వంటి కామెడీ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
నాగవంశీకృష్ణ అందించిన సంగీతం ఈ సినిమాకు ఆత్మలా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మే 8న థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా ప్రమోషన్లను స్పీడ్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ఏప్రిల్ 22న ‘నేను నా పల్లెటూరు’ అనే ఒక ప్రత్యేకమైన పాటను విడుదల చేయబోతున్నారు. సొంత గ్రామాన్ని అమితంగా ప్రేమించే వారికోసం, పల్లెటూరిని వదిలి దూరంగా ఉంటూ ఊరిని తలుచుకుని బాధపడే వారికోసం ఈ పాటను అంకితం ఇస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సాంగ్ పోస్టర్‌లో సుమంత్ ప్రభాస్ చల్లటి పొగమంచులో, పచ్చటి గడ్డిలో నిలబడి ప్రకృతిని ఆస్వాదిస్తున్న విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ థియేటర్స్‌లో విడుదల కానుంది. పల్లెటూరి వాతావరణం, గోదావరి యాస, మనసుని తాకే సంగీతం ఉండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది.






