- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్.. ‘రామాయణ’ కోసం ఏఆర్ రెహమాన్ అన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా?
సాధారణంగా స్టార్ హీరోలకు ఇచ్చే రేంజ్‌లో ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, సినిమా: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్ట్ ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పారితోషికం విషయంలో సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలకు ఇచ్చే రేంజ్‌లో ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసమే ఆయన ఏకంగా రూ. 30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. భారతీయ సినిమా చరిత్రలో ఒక సంగీత దర్శకుడికి ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కేవలం పారితోషికమే కాకుండా, ఈ చిత్రానికి వచ్చే లాభాల్లో కూడా ఆయనకు కొంత శాతం వాటా ఉండబోతోందన్న టాక్ వినిపిస్తోంది. రామాయణం వంటి మహా కావ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించేటప్పుడు సంగీతం అనేది ప్రాణవాయువు వంటిది. అందుకే మేకర్స్ ఏమాత్రం రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న రెహమాన్‌ను ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమా కోసం ఆయన హాలీవుడ్ లెవల్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారని, అందుకే ఆయన అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటం లేదని సమాచారం. ఈ సినిమా దాదాపు 6 గంటల నిడివితో రెండు భాగాలుగా వచ్చే అవకాశం ఉండటంతో, అందరిలో అంచనాలు పెరిగిపోయాయి.






