చెర్రీకి ఘన స్వాగతం పలికిన ప్రభుదేవా.. వీడియో వైరల్

by Disha Web Desk 6 |
చెర్రీకి ఘన స్వాగతం పలికిన ప్రభుదేవా.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం ఆస్కార్‌ అవార్డు సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చారిత్రాత్మక విజయాన్ని పొగుడుతూ అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఆస్కార్ వేడుకలు ముగించుకుని ఇండియాకు వచ్చిన రామ్ చరణ్.. వెంటనే తన తదుపరి చిత్రం ‘RC15’ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఇందులో భాగంగా ఈ మూవీ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, అతని బృందం కలిసి చెర్రీకి భారీ పూలమాలతో స్వాగతం పలికింది. అలాగే ‘నాటు నాటు’ పాటలోని సిగ్నేచర్ మూమెంట్ ప్రదర్శించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.



Next Story

Most Viewed