- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే దర్శకుడితో ఒకే రోజు 5 చిత్రాలను ప్రారంభించిన 5 నిర్మాణ సంస్థలు!
ప్రముఖ దర్శకుడు సత్యనారాయణ ఏకారితో ఒకేరోజు ఐదు నిర్మాణసంస్థలు ఐదు చిత్రాలను ప్రారంభించాయి.

దిశ, సినిమా: ప్రముఖ దర్శకుడు సత్యనారాయణ ఏకారితో ఒకేరోజు ఐదు నిర్మాణసంస్థలు ఐదు చిత్రాలను ప్రారంభించాయి. హైదరాబాద్ వేదికగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాలు మొదలవగా.. లక్కీ ఏకారి నిర్మాతగా ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 5, క్రాంతి కిరణ్ ప్రొడ్యూసర్గా శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 2, రంజిత్ కోడిప్యాక నిర్మాణంలో వాసవి మాత ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1, భాస్కర్ బస్వగాని నిర్మాతగా ఆర్య ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1, రవికుమార్ చౌదరి కసుకుర్తి ప్రొడ్యూసర్గా తేజస్వినిసాయి ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1గా 5 చిత్రాలను ఒకేసారి మొదలుపెట్టారు. కాగా ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్.. 'మొదటగా 2023 జనవరి 2నుంచి మొదలయ్యే 'ఫ్రమ్ నార్త్' అనే మూవీ షూటింగ్ షెడ్యూల్ కశ్మీర్లో13 రోజులు పాటు కోనసాగుతుంది. ఆ తర్వాతే మిగతా సినిమాలను తెరకెక్కించి 2023 వేసవిలో అన్నింటినీ థియేటర్లలో విడుదల చేస్తాం. త్వరలోనే నటీనటుల వివరాలు తెలియజేస్తాం' అన్నారు.
READ MORE
ఇద్దరు హీరోయిన్ల మధ్య వార్.. ఆ నటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నయనతార






