ఫైనల్లీ గుడ్ న్యూస్ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-10 03:41:43  IST  )

టాలీవుడ్ హీరోయిన్ వితికా శేరు(Vithika Sheru) ‘పడ్డానండి ప్రేమలో మరి’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘మహాబలిపురం’, ‘బీమిలి కబడ్డీ జట్టు’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఫైనల్లీ గుడ్ న్యూస్ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ వితికా శేరు(Vithika Sheru) ‘పడ్డానండి ప్రేమలో మరి’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘మహాబలిపురం’, ‘బీమిలి కబడ్డీ జట్టు’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్ మాత్రం అందుకోలేకపోయింది. అదే సమయంలో వరుస సినిమాలతో కెరీర్ పీక్స్‌లో ఉన్న వితికా.. టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకోవడంతో వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో కొంతకాలం పాటు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. చివరిసారిగా ‘పెళ్లి సందడి’ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన వితికా.. ఆ చిత్రం హిట్ అయినప్పటికీ ఆమెకు కొత్త అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ తర్వాత భర్త వరుణ్ సందేశ్‌(Varun Sandesh)తో కలిసి రియాలిటీ షో బిగ్‌బాస్‌లో పాల్గొని మరింత పాపులారిటీ పెంచుకుంది.

అయితే విన్నర్‌గా నిలవలేకపోయినా, ఈ షో ద్వారా వీరిద్దరికీ మంచి గుర్తింపు లభించింది. షో అనంతరం వరుణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. వితికా మాత్రం యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ, బిజినెస్ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక వీరి వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. పెళ్లై చాలా ఏళ్లు అయినప్పటికీ పిల్లలు లేరన్న అంశంపై వచ్చే ప్రశ్నలకు వితికా స్పష్టంగానే సమాధానాలు ఇస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా, ఆమె అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాను మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లో తన భర్త వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తుండగా, తాను హీరోయిన్‌గా కనిపించబోతోంది.

రియల్ లైఫ్ జంట మరోసారి వెండితెరపై రొమాన్స్ చేయనుండటం విశేషం. ఈ సినిమాకు కార్తిక్ భాగ్యరాజ దర్శకత్వం వహిస్తుండగా, మనస్విని భాగ్యరాజ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ‘డియర్ ఆస్ట్రోనాట్’ అనే ఆసక్తికర టైటిల్‌ను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వితికా, ‘‘చివరికి శుభ ఘడియలు వచ్చాయి. ఇంతకాలం రహస్యంగా ఉంచిన విషయాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాం. మా కొత్త సినిమా ‘డియర్ ఆస్ట్రోనాట్’ అని ప్రకటించడానికి గర్వంగా ఉంది’’ అని పేర్కొంది. ఇక విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. పోస్టర్‌లో వితికా ఆస్ట్రోనాట్ డ్రెస్‌లో కనిపిస్తుండగా, వరుణ్ ఆమెకు లిప్ కిస్ ఇస్తున్నట్లు చూపించారు. వెనక భాగంలో రాకెట్ దర్శనమివ్వడంతో ఈ సినిమా అంతరిక్షం నేపథ్యంగా సాగే ఓ ప్రత్యేకమైన ప్రేమకథగా ఉండబోతుందన్న అంచనాలు మొదలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ‘వావ్’, ‘సూపర్ కంబ్యాక్’ అంటూ వరుణ్–వితికా జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Read More..

భయంకర అనుభవాలు హీరోయిన్లకే కాదు హీరోలకు కూడా జరుగుతాయి.. చిత్రాంగద సింగ్ షాకింగ్ కామెంట్స్

Next Story