Samantha: ఫైనల్లీ మీ అందరి అనుమానాలకు సమాధానం ఇవ్వబోతున్నా.. గుడ్ న్యూస్ ప్రకటించిన సమంత!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

Samantha: ఫైనల్లీ మీ అందరి అనుమానాలకు సమాధానం ఇవ్వబోతున్నా.. గుడ్ న్యూస్ ప్రకటించిన సమంత!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ అమ్మడు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న సామ్.. ఇటీవల నిర్మాతగానూ ఇండస్ట్రీకి వచ్చి మొదటి చిత్రం ‘శుభం’తో ప్రేక్షకులను అలరించింది. అలాగే త్వరలోనే సినిమాల్లోకి కూడా రాబోతున్నట్లు తన నిర్మాణ సంస్థలో రాబోతున్న రెండు ప్రాజెక్ట్‌గా ‘మా ఇంటి బంగారం’(maa inti bangaram) రాబోతున్నట్లు వెల్లడించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతుండగా.. ఇందులో సమంత పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్‌ను కూడా షేర్ చేసింది. కానీ ఇన్ని రోజులు అవుతున్నా.. ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఆమె ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తుందా? లేదా రెండో పెళ్లి చేసుకుని సెటిల్ కానుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈనేపథ్యంలో.. తాజాగా, అభిమానులతో చిట్ చాట్ చేసిన సమంత పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ ‘మా ఇంటి బంగారం’ అప్డేట్ గురించి అడగా.. దానికి సామ్..‘‘మీరందరూ అనుమానాలు నేను సమాధానం ఇవ్వబోతున్నాను. ఈ నెలలోనే ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు రీఎంట్రీ గురించి అడుగుతున్న ప్రశ్నలకు ఈ మూవీతో మీముందుకు వచ్చి సమాధానం ఇవ్వబోతున్నాను’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, సమంత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇకపోతే.. సమంత చివరగా ‘ఖుషీ’ సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘శుభం’ లో చిన్న పాత్ర చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ రెండేల్ల తర్వాత ఆమె వెండితెరపై ఎక్కువ సమయం స్క్రీన్‌పై కనిపించనుంది. ఇక సమంత పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్న సామ్.. ఎక్కడికి వెళ్లినా అతనితో జంటగా వెళ్లింది. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నట్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా పలు పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఎన్ని వార్తలు వచ్చినా ఆమె మాత్రం అధికారికంగా స్పందించలేదు. ఈక్రమంలోనే ఓ కొత్త ఇల్లును కూడా కొనడంతో పెళ్లి వార్తలు జోరందుకున్నాయి.

Next Story