'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన ఫైమా.. పారితోషికం ఎంతో తెలుసా?

by Dishanational4 |
బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన ఫైమా.. పారితోషికం ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్ 6'లో 13 వారాలు పూర్తి చేసుకుని తుది దశకు చేరుకుంది. అయితే హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ల్లో ఒకరైన ఫైమా గత వారంలో ఎలిమినేట్ అయింది. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఫైమా టాస్క్‌ల పరంగా షోలో మొదటి నుంచి అదరగొట్టింది. దీంతో అందరూ టాప్ 5లో ఉంటుందనుకున్నారు. కానీ, తను బయటకు వచ్చింది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన వారి పారితోషికం వార్తలు వస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌‌లో 13 వారాలపాటు ఉన్న ఫైమా తీసుకున్న పారితోషకం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం 13 వారాలకుగాను ఫైమా రూ. 3 లక్షల 25 వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

READ MORE

'డైట్ సబ్య' నా పట్ల క్రూరంగా వ్యవహరిస్తోంది: స్టార్ హీరో తల్లి



Next Story

Most Viewed