నరేశ్, పవిత్ర పెళ్లి అంతా అబద్దమేనా.. ఫిల్మ్ నగర్ టాక్ ఇదే!

by Dishanational2 |
నరేశ్, పవిత్ర పెళ్లి అంతా అబద్దమేనా.. ఫిల్మ్ నగర్ టాక్ ఇదే!
X

దిశ , వెబ్ డెస్క్ : పవిత్ర, లోకేష్ కొన్ని రోజుల నుండి సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియా లో వీరిద్దరిపై ఎన్నో రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే వారు రూమర్స్ కు బ్రేక్ వేస్తూ తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ.. లిప్ కిస్ పెట్టుకున్న వీడియోను పోస్ట్ చేశారు. దీంతో కాస్త రూమర్స్ కి చెక్ పడినా.. వీరు నిజంగానే పెళ్లి చేసుకుంటారా అనుమానాలు చాలా మందిలో కలిగాయి.ఎట్టకేలకు..తాజాగా నరేష్‌, పవిత్ర పెళ్లి చేసుకున్నారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. కొంత మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఈ మేరకు నరేష్‌ ట్వీట్‌ చేసి.. వీడియో రిలీజ్‌ చేశాడు.అయితే ఈ పెళ్లి ఫేక్ అంటూ మరో రూమర్ వైరల్ అవుతుంది. ఇది ఇంకా పేరు కూడా పెట్టని ఓ సినిమలో సీన్ మాత్రమే.. నరేష్ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంటూ ముచ్చటిస్తన్నారు.

దీంతో కొందరు పాపం నరేశ్.. మేము మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ఒకటి అవుతున్నాం అంటూ వీడియో పోస్టు చేసి, తాను నిజంగా పవిత్రను పెళ్లి చేసుకున్నప్పటికీ కొందరు ఈ పెళ్లిని నమ్మడం లేదు.

వారు తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించినా నమ్మకపోవడనికి కారణం లేకపోలేదు.. వీరు చేసిన చిన్న చిన్న తప్పులే దీనికి కారణం అంటూ చెప్పుకొస్తున్నారు. దీని బట్టి చూస్తే వీరి పెళ్లి నిజమే అయినా.. ఫేక్ పెళ్లి అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నట్లు అర్థం అవుతుంది. మరి ఈ పెళ్లి నిజమో అబద్దమో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సందే అంటున్నారు.

Read more:

పవిత్ర-నరేష్ : పెద్దలు లేకుండా జరిగిన ఏకైక పెళ్లి ఇదే

Next Story

Most Viewed