- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఏ భారతీయ నటికి దక్కని అరుదైన గౌరవం.. కరీనాకు మాత్రమే సొంతం..
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ తన అందంతో, అభినయంతో తన అభిమానుల మనసు దోచుకుంటుంది. ప్రస్తుతం ది బకింగ్‌హామ్ మర్డర్స్ చిత్రంతో తెరపైకి వచ్చి అభిమానులను మెస్మరైస్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఆమె అభిమానులకు మరింత ఉత్తేజకరమైన వార్త చెవిన పడింది. అది ఏంటి అంటారా ప్రముఖ బాలీవుడ్ నటి 2025లో సినీపరిశ్రమలో 25 వసంతాలు పూర్తి చేసుకుని భారీ మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఆమె పేరు మీద ఒక ప్రత్యేక ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఇంతకు ముందు మరే ఇతర భారతీయ నటికి అందని గౌరవం కరీనాకు మాత్రమే దక్కింది.
పింక్‌విల్లా నుండి వచ్చిన నివేదికల ప్రకారం ఈ చలన చిత్రోత్సవంలో కరీనా నటించిన అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో కొన్నింటిని ప్రదర్శించనున్నారు. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ నటుల కోసం నిర్వహించిన చలన చిత్రోత్సవాల అడుగుజాడలోనే ఈ వేడుక జరుగుతుంది. 2022లో దిలీప్ కుమార్ 100 వ జన్మదినోత్సవం సందర్భంగా దిలీప్ కుమార్ హీరో ఆఫ్ హీరోస్ పేరుతో ఉత్సవాన్ని నిర్వహించారు. అదేవిధంగా అమితాబ్ బచ్చన్ 80వ పుట్టిన రోజు సందర్భంగా నాలుగు రోజుల చలన చిత్రోత్సవాన్ని నిర్వహించారు. ఇప్పుడు కరీనా కపూర్ బాలీవుడ్‌లో తన 25 ఏండ్ల ప్రయాణాన్ని జరుపుకుంటూ ఈ సినీ లెజెండ్స్ లిస్ట్ లో చేరింది.
రెఫ్యూజీ నుండి స్టార్‌డమ్ వరకు..
కరీనా కపూర్ 2000లో అభిషేక్ బచ్చన్ సరసన రెఫ్యూజీ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. జె.పి.దత్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినప్పటికీ, కరీనా నటన అందరి దృష్టిని ఆకర్షించింది. ముజే కుచ్ కెహనా హై, యాదీన్ , అజ్ఞాతవాసి, అశోక వంటి చిత్రాలతో ఆమె కెరీర్ వేగం పుంజుకోవడం ప్రారంభం అయ్యింది. అయితే 2001 బ్లాక్‌బస్టర్ కభీ ఖుషీ కభీ ఘమ్ ఆమెను నిజంగా స్టార్‌డమ్‌లోకి తీసుకువచ్చింది. హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, కాజోల్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి నటించిన కరీనా బబ్లీ, గ్లామరస్ “పూ” పాత్రలో నటించింది.
25 సంవత్సరాలుగా కరీనా అన్ని రొమాంటిక్, కామెడీల నుండి యాక్షన్ థ్రిల్లర్‌ల వరకు అన్ని రకాల పాత్రలను పోషించింది. జబ్ వి మెట్‌లో ఆమె కామిక్ టైమింగ్ అయినా, సింగం రిటర్న్స్‌లో ఆమె యాక్షన్-ప్యాక్డ్ పాత్ర అయినా లేదా చమేలీలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది.
Read More....
ఆయనను చూసిన తర్వాత కన్నీళ్ళు వచ్చాయి.. పరిణీతి చోప్రా ఎమోషనల్ పోస్ట్