భీమవరంలో సందడి చేసిన టిల్లు బ్యూటీ

by Mallepaka Hamsa |

భీమవరం జెపి రోడ్డులో గోయజ్ సిల్వర్ జువెలరీ(Goyaz Silver Jewellery) షోరూంను సినీనటి నేహా శెట్టి (Neha Shetty)ప్రారంభించారు.

భీమవరంలో సందడి చేసిన టిల్లు బ్యూటీ
X

దిశ, సినిమా: భీమవరం జెపి రోడ్డులో గోయజ్ సిల్వర్ జువెలరీ(Goyaz Silver Jewellery) షోరూంను సినీనటి నేహా శెట్టి (Neha Shetty)ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ఇప్పటి వరకు 20వ షోరూంలున్నా 3వ స్టోర్ నేను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నాకు వడ్డాణం అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడ వడ్డాణం కలెక్షన్స్ చూస్తుంటే అన్ని తీసేసుకోవాలని ఉందని సినీనటి నేహా శెట్టి (డీజే టిల్లు ఫేం) అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 19 స్టోర్లతో విస్తరించి భీమవరంలో 20వ స్టోర్ గా ప్రారంభమైందన్నారు. యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ షోరూంలో మంచి సిల్వర్‌ జ్యువెలరీ కలెక్షన్లు ఉన్నాయని సినీనటి నేహా శెట్టి చెప్పింది. నిర్వాహకులు రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక సిల్వర్‌ జ్యువెలరీ స్టోర్‌ గోయజ్‌ అని, వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

Next Story