- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ దేవరకొండతో ఆ మూవీ తీసుంటే.. జనాలు తిట్టిపోసే వారు
by Chukka Sudharani |
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఎంత మంచి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఎంత మంచి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ మూవీ హీరోగా విజయ్ దేవరకొండను, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను ఓవర్ నైట్ స్టార్స్‌ను చేసింది. అయితే ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కుమార్తే స్వప్నా దత్ ఈ సినిమా గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తి కరమైన విషయాలు పంచుకుంది.
‘‘అర్జున్ రెడ్డి’ మూవీ కథను ముందుగా నాకు చెప్పారు. కానీ స్టోరీ వినగానే సినిమా నిర్మించడానికి నాకు ధైర్యం సరిపోలేదు. కానీ అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పుడు ఎంతో చింతిస్తున్నా. కానీ నేను ఒక్కటే ఆలోచించా.. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే ఓ మహిళ ఇలాంటి మూవీ ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని ప్రజలు విమర్శించేవారు. అందుకే ధైర్యం చేయలేకపోయాను. ఆ నిర్ణయంపై ఇప్పుడు బాధపడుతున్నాను’ అని తెలిపింది.
Next Story






