తోడు లేనందుకు బాధ కలుగుతోంది.. 37 ఏళ్ల వయసులో పెళ్లిపై స్టార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

స్టార్ హీరోయిన్ నిత్యామీనన్(Nithya Menon) విభిన్న కథలు ఎంచుకుంటూ వరుస సినిమాల్లో నటిస్తోంది.

తోడు లేనందుకు బాధ కలుగుతోంది.. 37 ఏళ్ల వయసులో పెళ్లిపై స్టార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నిత్యామీనన్(Nithya Menon) విభిన్న కథలు ఎంచుకుంటూ వరుస సినిమాల్లో నటిస్తోంది. ఈ అమ్మడు త్వరలో ‘సార్ మేడమ్’(Sir, Madam) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాండిరాజ్ దర్శకత్వం వహించగా.. విజయ్ సేతుపతి హీరోగా నటించాడు.ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నా జీవితంలో ఒకప్పటి ఆలోచనలో పోలీస్తే, ఇప్పుడు ప్రేమకు అంత ప్రాధాన్యత లేదు. పలు కారణాల వల్ల సోల్‌మేట్ ఉండాలని అనిపించేది. అతడిని వెతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెళ్లి బంధంలో కాకుండా వేరే రకంగా కూడా జీవితాన్ని ఆనందించవచ్చని అర్థం అయింది. ప్రతి ఒక్కరికి ప్రేమించిన వ్యక్తి జీవిత భాగస్వామిగా చేసుకోవడం సాధ్యపడదు.

పెళ్లి అనేది లైఫ్‌లో ఒక భాగం మాత్రమే. అది జరిగినా.. జరగకపోయినా మార్పు ఉండదు. తోడు లేనందుకు ఒక్కోసారి బాధ కలిగినప్పటికీ స్వేచ్ఛగా లైఫ్ లీడ్ చేస్తున్నా అని ఆనందంగా ఉంది. నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల కారణంగా ఇప్పుడు ఇలా ఉన్నాను. ఏది జరిగినా మన మంచికే అనుకుని ముందుకు సాగడం మంచిది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. 37 ఏళ్లు వచ్చాయి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావంటూ హీరోయిన్‌కు ప్రశ్నలు వేస్తున్నారు.

Next Story