Pakisthan First Netflix Series.. షారుఖ్ హీరోయిన్ కూడా ఇందులో నటిస్తుందిగా..

by Disha Web Desk 9 |
Pakisthan First Netflix Series.. షారుఖ్ హీరోయిన్ కూడా ఇందులో నటిస్తుందిగా..
X

దిశ, సినిమా: షారుఖ్‌ ఖాన్‌ ‘రాయీస్’లో హీరోయిన్‌గా నటించిన మహీరా ఖాన్, కపూర్ అండ్ సన్స్ చిత్రంలో హీరోగా నటించిన ఫవాద్ ఖాన్ ఇద్దరూ పాకిస్థాన్ నటులే. కానీ బాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌తోనూ మెప్పించారు. పైగా పాక్ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో సూపర్ పాపులర్ అయిన వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు కూడా బిగ్ హిట్. కాగా ప్రస్తుతం పాకిస్థాన్ ఫస్ట్ ఒరిజినల్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌ కోసం మరోసారి జత కట్టబోతున్నారు. 2013లో వచ్చిన ఉర్దూ నావెల్ ‘జో బచే హై సంగ్ సమెట్ లో’ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా.. హార్వర్డ్‌లో లా స్టూడెంట్ అయిన సికిందర్ చుట్టూ కథ ఉంటుందని టాక్. ఆయన జీవితాన్ని మార్చే ఒక సంఘటనను చూసినప్పుడు.. ఆల్రెడీ గతంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్న లిజా అనే కళాకారిణిని కలుస్తాడు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది సిరీస్.

ఇవి కూడా చదవండి :

నా కొడుకు సినిమా చూసేందుకు చాన్స్ ఇవ్వండి ప్లీజ్.. నటుడి అభ్యర్థన.. ఇంతకీ ఏమైందంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఒక్కసారి కూడా నటించని ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

Next Story

Most Viewed