పని దొరకదనే భయంతోనే ఆ వ్యాధి ఉన్నట్లు చెప్పలేదు: Fatima Sana Shaikh

by Hajipasha |   (  Updated:2022-11-29 11:41:26  IST  )

బాలీవుడ్ నటి ఫాతిమా సనా తనకు మూర్ఛ వ్యాధి ఉందనే విషయాన్ని దాచడానికి గల కారణాన్ని వెల్లడించింది.

పని దొరకదనే భయంతోనే ఆ వ్యాధి ఉన్నట్లు చెప్పలేదు: Fatima Sana Shaikh
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి ఫాతిమా సనా తనకు మూర్ఛ వ్యాధి ఉందనే విషయాన్ని దాచడానికి గల కారణాన్ని వెల్లడించింది. చిన్నప్పటి నుంచి ఈ సమస్యతో బాధపడుతున్న నటి.. ఈ మధ్యనే ఈ వ్యాధి వల్ల తను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ గురించి ఓపెన్ అయింది. తాజా ఇంటరాక్షన్‌లోనూ మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆమె.. తనకు మూర్ఛ ఉందని చెప్పేందుకు చాలా భయపడ్డట్లు తెలిపింది. దీని గురించి చెబితే ఇండస్ట్రీలో తనను పనిలోకి తీసుకోరని ఆందోళన చెందానన్న బ్యూటీ.. 'నేను కావాలని దాచలేదు. నాకు నాడీ సంబంధిత పరిస్థితి ఉందని అంగీకరించడానికి ఇష్టపడలేదు. జనాలందరికీ నేను ఆరోగ్యంగానే ఉన్నానని తెలుసు. కాబట్టి మళ్లీ నన్ను బలహీనంగా భావించాలని కోరుకోలేదు. ప్రాణాలతో బయటపడినందుకు నిజంగా అదృష్టవంతురాలిని' అంటూ చెప్పుకొచ్చింది. చివరగా తానెప్పుడూ ఒంటరిగా ప్రయాణించలేనని, తనకు తప్పనిసరిగా తోడు కావాల్సిందేన్న ఆమె.. వ్యాధి గురించి ఇటీవలే నిర్మాతలకు చెప్పానని, సెట్‌లో మూర్ఛ వచ్చే ముందు తనకోసం ఒక నిర్దిష్ట ప్రోటోకాల్‌ను ఇస్తున్నట్లు తెలిపింది.

Next Story