ఫాదర్స్ డే స్పెషల్.. కూతురి ఫేస్ రివీల్ చేస్తూ జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ పోస్ట్.. పాప ఎంత క్యూట్‌గా ఉందో..

by Mallepaka Hamsa |

బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో రాకింగ్ రాకేష్(Rocking Rakesh) కూడా ఒకరు. ఆయన ఎన్నో స్కిట్స్ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

ఫాదర్స్ డే స్పెషల్.. కూతురి ఫేస్ రివీల్ చేస్తూ జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ పోస్ట్.. పాప ఎంత క్యూట్‌గా ఉందో..
X

దిశ, సినిమా: బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో రాకింగ్ రాకేష్(Rocking Rakesh) కూడా ఒకరు. ఆయన ఎన్నో స్కిట్స్ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కామెడీ టైమింగ్‌తో పలు సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక కమెడియన్‌గా కొనసాగుతున్న సమయంలోనే లేడీ కమెడియన్, యాంకర్ సుజాత(sujatha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఇస్మార్ట్ జోడీలో పాల్గొని పలు టాస్కుల్లో గెలిచి బెస్ట్ జోడీగా అనిపించుకున్నారు. ఇక పెళ్లి తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తమ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. ఇక గత ఏడాది సుజాత ప్రెగ్నెంట్ అయిందన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే సీమంతం ఫొటోలు, తమకు పాప పుట్టిందన్న విషయం కూడా వెల్లడించారు.

కానీ ఆ పాప ముఖాన్ని మాత్రం చూపించలేరు. సినీ సెలబ్రిటీల మాదిరిగా ఇన్నాళ్లు దాచిపెట్టారు. తాజాగా, (నేడు జూన్ 15) ఫాదర్స్ డే సందర్భంగా రాకేష్ తన కూతురి ఫేస్‌ను రివీల్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ‘‘మీ ఆశీస్సులతో మొదటిసారిగా మేము మా పాప ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాము.నీకు తండ్రి అవడం నా అదృష్టం ఖ్యాతిక అమ్మ నాన్న అనే పిలుపుని పిలవడం నా బాల్యం నుండే దూరమయ్యాను.

కానీ నాకు ఎటువంటి లోటు లేకుండా కంటికి రెప్పలా పెంచి ఇంత వాడిని చేసింది మా అమ్మ అమ్మ లో ‘అ’ నాన్నలో ‘న్న’.. అన్న అనే పిలుపుతో నన్ను వెన్నుంటి నడిపించాడు నా ‘తమ్ముడు’. మా ఇంట అడుగుపెట్టిన లక్ష్మీదేవి సుజాత. నాన్న నన్ను పిలుపుతో శిఖరానికి చేర్చింది. మా బంగారు తల్లి ఖ్యాతికమ్మకి ఓ మంచి తండ్రిగా నీ ప్రతి అడుగులో నేనుంటా తల్లి. నీకు తండ్రి అవడం నా అదృష్టం. నాన్న అన్న పిలుపుతో నా జీవితం ధన్యం’’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు మీ పాప చాలా క్యూట్‌గా ఉంది అచ్చం లక్ష్మి దేవిలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

Instagram link

Next Story