- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > క్రికెట్ స్టేడియంను ఊపేసిన 'ఊ అంటావా' సాంగ్.. ఏ మాత్రం తగ్గని సమంత క్రేజ్!
క్రికెట్ స్టేడియంను ఊపేసిన 'ఊ అంటావా' సాంగ్.. ఏ మాత్రం తగ్గని సమంత క్రేజ్!
దిశ, సినిమా : టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన సమంత ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది.

X
దిశ, సినిమా : టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన సమంత ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఆ మధ్య నాగచైతన్యతో విడాకుల వార్తలతో లైమ్‌లైట్‌లో నిలిచిన సామ్.. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో 'పుష్ప' సినిమాలో వేసిన స్టెప్పులతో ఇండియా మొత్తాన్ని ఊపేసింది. సమంత ఆడిపాడిన 'ఊ అంటావా.. ఊ ఊ అంటావా' సాంగ్ భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా మారుమోగింది. కొంతకాలం పార్టీలు, పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌లో ఎక్కడ చూసినా ఇదే పాట వినపడింది. ఇప్పటికి కూడా ఈ పాట క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోగా.. చివరకు క్రికెట్ మ్యాచ్‌ల్లో కూడా ఇదే సాంగ్‌కు స్టెప్పులేస్తున్నారు అభిమానులు. ఇటీవలే భారత్-విండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా 'ఊ అంటావా' సాంగ్‌కు మైదానంలోనే చిందులేస్తూ ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Next Story






