రష్మిక లేటెస్ట్ పిక్స్ చూసి షాక్ అవుతున్న అభిమానులు.. జిమ్ లో అవేం పనులు?

by Prasanna |
రష్మిక లేటెస్ట్ పిక్స్ చూసి షాక్ అవుతున్న అభిమానులు.. జిమ్ లో అవేం పనులు?
X

దిశ,సినిమా : నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య కాలంలో డీప్ ఫేక్ వీడియోతో ఎన్ని బాధలు పడిందో మనందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో బిగ్‌బి నటించిన గుడ్ బై మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. దీని తర్వాత, మిషన్ మజ్ను, యానిమల్‌తో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. గతంలో విడుదలైన 'పుష్ప పార్ట్ -1 ది రైజ్' మూవీతో రష్మిక సినీ కెరియర్ మారిపోయింది.

పుష్ప - ది రూల్ చిత్రం త్వరలో విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమా ఆగస్ట్ 15 నుంచి డిసెంబర్ వాయిదా పడింది. రష్మిక మందన్న ప్రస్తుతం సల్మాన్ ఖాన్, మురుగదాస్ చిత్రాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కన్నడ భామ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో నటించనుందని సమాచారం. ఇదిలా ఉండగా, జిమ్ చేస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోలపై నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తూ రష్మికను ఆడుకుంటున్నారు. జిమ్ లో ఉండగా కూడా ఫోటోలు షేర్ చేయడం అవసరమా.. నువ్వు జిమ్ కి వెళ్తావ్ అని అందరికి తెలుసు.. సగం సగం బట్టలు వేసుకుని.. ఏం పనులు ఇవి అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు.Next Story

Most Viewed